♪♫
TG-5604
Telugu
మెరిసేటి తారలా నను వెలిగించు
meriseeti taaralaa nanu veliginchu
Pranam Kamlakharజాషువు షైక్ , దేవా ప్రసాద్ · Joshua Shaik , Deva Prasadయెరూష, రూబీ జోన్స్ · Erusha, Ruby Jones
18
views
పల్లవి
మెరిసేటి తారలా నను వెలిగించు కురిసేటి జల్లులా నను దీవించు (2) నా ఊపిరివై నా జీవితమై (2) నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై ||మెరిసేటి||
1వ చరణం
నీ కనులే నా మనసే తేరిచూడగా నాలోనా ఏ మంచి కానరాదుగా నీ కృపలో నా గతమే చూడలేదుగా సరిచేసి నడిపించు నీదు సాక్షిగా నీతి సూర్యుడా నాదు యేసయ్య జీవితాంతము జాలి చూపవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై (2) ||మెరిసేటి||
2వ చరణం
నీ మమతే తీయనిదీ మారదెన్నడు లాలించే నీ ప్రేమ వీడదెన్నడు ఊహలకే అందనిది నీదు కార్యము నీ మాటే నాలోన నిండు ధైర్యము సర్వశక్తుడా నాదు యేసయ్య ఆశ్రయించగా ఆదరించవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై (2) ||మెరిసేటి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
