TG-3709
Telugu

మూడునాళ్ళ ముచ్చట కోస

Moodunaalla Muchchata Kosam

15
views
పల్లవి

మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలే బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ||

1వ చరణం

ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) నిత్యమైన సుఖము వెదకరా నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ||

2వ చరణం

తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.