మోయలేని భారమంత
Moyaleni Bhaaramantha
మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు – (2) కడలి పై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శీలలతో వ్రేళాడే (2) ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము (2) ||మోయలేని||
జయము నీకని పలికిన జనము మహిమ ఏదని నిను నిలదీసిరి పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి (2) తాకినంతనే మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము (2) ||మోయలేని||
దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చేర్చిరి మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తీర్చిరి (2) ఇంత జరిగిన ఎంత కరుణ వదలవేమయ నీ క్షమాపణ (2) ||మోయలేని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.