మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ
muudunaalllla muchchata koosam ee
మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలే బంధాలురా వల్లకాటి వరకేరా భవబంధాలు అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో ||మూడునాళ్ళ||
ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం నిత్యమైన సుఖము వెదకరా నిరతము ఆ ప్రభుని వేడరా తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.