TG-5133
Telugu

నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే

Naa Aashala Pallaki Neevee Naa Oohala Oota Neevee

21
views
పల్లవి

నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా ఆశ నీవయ్యా (2) ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2) నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే దాహము తీర్చావని (2) దాహము తీర్చావని ||యేసయ్యా||

1వ చరణం

దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే (2) నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే తోడుగ ఉన్నావని (2) తోడుగ ఉన్నావని ||యేసయ్యా||

2వ చరణం

స్నేహితులు లేరని – తోడెవరు రారని నా మనసు నాలోన – దుఃఖించు సమయాన (2) నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు ఆదరించావయ్యా (2) ఆదరించావయ్యా ||యేసయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.