TG-3499
Telugu

నా భారమంతా నీ పైనే యేసయ్యా

naa bhaaramantaa nee painee yeesayyaa

Baluపాస్టర్ సుందర్ పాల్ · Pastor Sundar Paulపాస్టర్ సుందర్ పాల్ · Pastor Sundar Paul
0
views
Chorus

నా భారమంత నీ పైన మోపానయ్యా నన్ను ఆదరించి ఆదుకో నా యేసయ్యా (2) ఏమి చేయాలో తెలియుటలేదయ్యా నాకున్న దిక్కు నీవే యేసయ్యా (2) కోరుకున్న దేవుడవు నీవే నీకు సాధ్యమే సమస్తము సాధ్యమే (2) ||నా భారమంత||

1వ చరణం

వేదనలు గుండెను వేదించగా రోదనతో నేను కన్నీరు కార్చగా (2) ఆదరణ లేక అల్లాడిపోగా అంధకారమే నన్ను ఆవరించగా (2) ఆదరించే దేవుడవు నీవే నీకు సాధ్యమే సమస్తము సాధ్యమే (2) ||నా భారమంత||

2వ చరణం

మాటలు మనస్సును గాయపరచగా ఒంటరిగా నేను కుమిలిపోగా (2) నా అన్నవారే అపహసించగా మౌనంగా నే నీకై వేచియుంటిగా (2) చూచుచున్న దేవుడవు నీవే నీకు సాధ్యమే సమస్తము సాధ్యమే (2) ||నా భారమంత||

3వ చరణం

సిలువలో నాకై బలియైతివిగా భరించలేని భాదను భరించినావుగా (2) నీ ప్రాణత్యాగమే రక్షనివ్వగా పరిశుద్దాత్మతో నన్ను ముద్రించినావుగా (2) పరిశుద్ధ దేవుడవు నీవే నీకు సాధ్యమే సమస్తము సాధ్యమే (2) ||నా భారమంత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.