నా చెలిమి కోరి

naa chelimi koori

🎵 TG-2669🌐 Telugu
పల్లవి

నా చెలిమి కోరి – నీ కలిమి వీడి నా చెంత చేరావు శ్రీమంతుడా నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి||

1వ చరణం

ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని ఏ రీతి నిన్ను – కీర్తించగలను నా నీతి నీవే ఓ యేసుదేవా నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా

Report Error