TG-5157
Telugu

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ

Naa Chinni Hrudayamu Ninnee Preeminchanee

0
views
పల్లవి

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ నిను చాటనీ – నిను ఘనపరచనీ నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని||

1వ చరణం

కావలివారూ వేకువకై చూచునట్లు నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2) నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని||

2వ చరణం

దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2) నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని||

3వ చరణం

పనివారు యజమాని చేతివైపు చూచునట్లు నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2) నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని||