TG-5158
Telugu

నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్

Naa Chinni Hrudayamuthoo Naa Goppa Deevuni Nee Aaraadhinchedan

38
views
పల్లవి

నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును (2) మన్నైన నేను మహిమగ మారుటకు నీ మహిమను విడచితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే (2) నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయూ (2) నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.