TG-1096
Telugu

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు

naa deepamu yeesayyaa neevu veliginchinaavu

188
views
పల్లవి

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా - జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము

1వ చరణం

ఆరని దీపమై దేదీప్యమానమై నాహృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండగ - వెలిగావు నిండుగా ||నా దీపము||

2వ చరణం

మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా ||నా దీపము||

3వ చరణం

ఆగని హోరులో ఆరిన నేలపై నాముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా ||నా దీపము||