TG-3431
Telugu

నా దేవ నీవే - కరుణించరావా

naa deeva neevee - karunincharaavaa

Pranam Kamlakharజాషువు షైక్ · Joshua Shaikఅన్వేష్షా · Anwesshaa
0
views
Chorus

నా దేవ నీవే - కరుణించరావా నాలోన నీవే - నివసించరావా కడదాక యేసు - నడిపించరావా (2)

1వ చరణం

నీ ధ్యాసే - నాలో - అభయం నీ ప్రేమే - కోరా - నిరతం దీవిస్తావనీ - నిను చూడాలనీ - నా మౌన గీతం గమనిస్తావనీ - బదులిస్తావనీ - ఈ ప్రేమరాగం నా తల్లివై - నా తండ్రివై - నా యేసుదేవా నను ఆదరించరావా ||నా దేవ నీవే||

2వ చరణం

నీలోనే - సాగే - పయనం నీ ఒడిలో - చేరే - తరుణం మాటిస్తావనీ - మరుగేకావనీ - నీ తోడు కోసం మొరవింటావనీ - వెలిగిస్తావనీ - నా ఆత్మ దీపం ఉన్నానుగా - వేచానుగా - నా యేసుదేవా నను ఆదరించరావా ||నా దేవ నీవే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.