♪♫
TG-5160
Telugu
నా జయము కోరిన దేవా సైన్యములకధిపతి యెహోవా
Naa Jayamu Koorina Deevaa Sainyamulakadhipathi Yehoovaa
0
views
పల్లవి
నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా నా వేదనంతయూ - ఉత్తరముపైవ్రాసి నీదు మందిరమందున - పరచి ప్రార్ధనచేయగా దూతను పంపి - దీవెనతో నింపి - మాకు జయమిచ్చితివే నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా శోధన జయింపనూ - ప్రార్ధన నేర్పిన దేవా నీ ప్రజల నెమ్మది కోరి - ఆదరణకర్తను పంపితివి విశ్వాసి ప్రార్ధనకు - విశ్వముపైన - విజయమిచ్చెదనంటివే నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా