నా జీవం నీ కృపలో దాచితివే
Naa Jeevan Nee Krupaloo Daachithivee
నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం ||నా జీవం||
పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే (2) పావురము వలె నీ సన్నిధిలో జీవింప పిలచితివే (2) ||నా జీవం||
ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే (2) నీ బాహు బలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే (2) ||నా జీవం||
కానాను యాత్రలో యొర్దాను అలలచే కలత చెందితినే (2) కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే (2) ||నా జీవం||
వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే (2) వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం||
స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా (2) స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.