TG-3376
Telugu

నా జీవితం యేసయ్యా నీవేర్పరచినది

naa jeevitam yeesayyaa neeveerparachinadi

Daniel Surya Avulaవరప్రసాద్ నూకటట్టు · Varaprasad Nukatattu
0
views
Chorus

నా జీవితం యేసయ్యా నీవేర్పర్చినది నా జీవితం నీ కొరకే సమర్పింతును (2) అర్పించెదను నా జీవితం నే బ్రతుకు దినములన్నియు నీ పాద సేవకే.. యేసయ్యా.. నీ పాద సేవకే...

1వ చరణం

నేను ఎన్నెన్నో ప్రేమలు వెతికిన నీ ప్రేమకు సరిలేదు ఈ లోకం లో (2) ఇంతకాలము నీ ప్రేమను ఎరుగక నా బ్రతుకును వ్యర్ధముగా గడిపితినయ్యా (2) వ్యర్ధముగా గడిపితినయ్యా ||నా జీవితం||

2వ చరణం

నా ప్రాణప్రియులు నా కుటుంబసభ్యులు నా బంధుమిత్రులు నన్ను ఎడబాపినా (2) ఎడబాయక నన్ను త్రోసివేయక నా తప్పులు క్షమియించి నన్ను చెరదీసిన యేసయ్యా (2) నన్ను చెరదీసిన యేసయ్యా ||నా జీవితం||

3వ చరణం

నేనెరిగితి దేవా ఈ ప్రాణము నీదని నీ కోసమే అది వెచ్చించాలని (2) దయచేయుమా పరిశుద్ధాత్మ నింపుదల నేనన్నటికి నీ దాసుడనై ఉండాలని (2) నీ దాసుడనై ఉండాలని ||నా జీవితం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.