నా జీవిత కాలమంతా నిన్నే స్తుతియించెదా
Naa Jeevitha Kaalamanthaa Ninnee Sthuthiyinchedaa
నా జీవిత కాలమంతా నిన్నే స్తుతియించెదా నేను బ్రతుకు దినములంతా నిన్ను నేను చాటెదా (2) ఆరాధనా ఆరాధనా (4) ||యేసు||
నా జీవిత పయనములో మలుపులెన్నో వచ్చినా అనుకోని ఆపదలే నన్ను చుట్టుముట్టినా (2) ఇమ్మానుయేలువై నన్ను నీలో దాచితివే (2) నా పక్షమై నిలచి నన్ను ఆదరించితివే (2) ||ఆరాధన||
అపవాది బాణములే నన్ను బాధించినా - ఆశలన్నీ కోల్పోయి నిరాశలో మునిగినా (2) ఆశ్చర్యకరుడవై - నన్ను ఆదుకొంటివే (2) ఆనంద మయముగా నన్ను మార్చి వేసితివే (2) ||ఆరాధన||
అయినవారందరు నన్ను విడిచి వెళ్లినా ఆదరించు వారే లేక ఒంటరినై మిగిలినా (2) నా కన్న తండ్రివై నన్ను చేరదీసితివే (2) కలనైన మరువ లేని - కార్యాలు చేసితివే (2) ||ఆరాధన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.