నా జీవిత యాత్రలో
Naa Jeevitha Yaathralo
నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత||
పలు విధ శోధన కష్టములు ఆవరించియుండగా (2) కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము (2) ||నా జీవిత||
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు (2) నీదు కుడి హస్తములో నిత్యమున నాకు సుఖ క్షేమముగా (2) ||నా జీవిత||
ఈ లోక నటన ఆశలన్నియు తరిగిపోవుచుండగా (2) మారని వాగ్ధానములన్నియు నే నమ్మి సాగెదను(2) ||నా జీవిత||
ముందున్న సంతోషము తలంచి నిందలను సహించి (2) నీ సిలువను నే మోయుటకై నీ కృప నాకీయుము (2) ||నా జీవిత||
సీయోను యొక్క ఆలోచనతో సదా నడిపించుము (2) మహిమలో నీతోనే నిల్చుటకు నా తండ్రి దయచూపుము (2) ||నా జీవిత||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.