నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం
naa jeevitha yaathraloo prabhuvaa - nee paadamee sharannam
🎵 TG-1091🌐 Telugu
పల్లవి
నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం ఈలోకమునందు నీవు తప్ప - వేరే ఆశ్రయం లేదు
1వ చరణం
ఈ లోకనటన ఆశలన్నియు - తరిగి పోవుచుండగా మారని నీ వాగ్ధానములన్నియు - నే నమ్మిసాగెదను ||నాజీవి||
2వ చరణం
పలువిధ శోధన, కష్టములు - ఆవరించు చుండగా కలత చెందుచున్న నా హృదయమును - కదలకకాపాడుము ||నాజీవి||
3వ చరణం
నీసన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు నీదు కుడి హస్తములో నిత్యమున్న - నాకు సుఖక్షేమమేగా ||నాజీవి||