నా జీవితాంతము నీ సేవ చేతునంటిని
Naa Jeevithaanthamu Nee Seeva Cheethunantini
నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నే బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని నా మనవి వింటివి నన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము||
నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||
రోగముతో పలుమార్లు పడియుండ లేపితివి ఘోరమై పోకుండా స్థిరపరచి కాచితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||
దూషించు దుష్టులకు సిగ్గును కలిగించితివి వేలాది ఆత్మలకు మేలుగ నన్నుంచితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||
సంఘములు కట్టుటకు సామర్ధ్యమిచ్చితివి ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.