నా కాలగతు లెవ్వి నా

naa kaalagathu levvi naa

🎵 TG-013💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు ||నా కాలగతు||

1వ చరణం

తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను ||నా కాలగతు||

2వ చరణం

పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా ||నా కాలగతు||

3వ చరణం

సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ||నా కాలగతు||

4వ చరణం

సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి ||నా కాలగతు||

Report Error