TG-5138
Telugu

నా కన్నుల్లో ఆనందమే హరించెనే

Naa Kannulloo Aanandamee Harinchenee

17
views
పల్లవి

నా కన్నుల్లో ఆనందమే హరించెనే జీవితంలో బంగారు ప్రేమనే కోల్పోయేనే ఆదరణే లేక నా హృదయము పగిలిపోయెనే యేసు నా చేయి వీడక నీతో నన్ను కొనిపోవుము నాలో ఈ వేదన ఈ కన్నీటి జీవితం భారమై నను కాల్చేనే ఈ కష్టాల ఊబిలో నాకు నీవే తోడుగా ఉండవా ఓ యేసయ్య ప్రకాశించే నక్షత్రాలు ఆకాశంలో ఎంత సుందరమో అటువలె నా రోజులన్నియు కొంతకాలమే ప్రకాశించెన్ దేవా రావా నేను మునిగిపోవుచున్నాను నన్ను నీవే ధైర్యపరచి ఉంచవా ఈ లోక సంద్రములో నే ఉండను నా దాగు చోటు నీవై ఉండు యేసయ్య నన్ను కాపాడవా నా హృదయమును చక్కదిద్దవా దేవా నీవెంతయినా నమ్మదగిన వాడవు ప్రభు జీవితం ఎంత దుఃఖమైనా చివరికి నీ కిరీటమిస్తావు నన్ను నీదు శక్తితో నింపి జీవింపచేయుము నీకే తెలియును నా వేదనంతయు ఈ లోక సంద్రములో నే ఉండను నా దాగు చోటు నీవై ఉండు యేసయ్య నన్ను కాపాడవా నా హృదయమును చక్కదిద్దవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.