నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ
Naa Kanuchoopu Meera Yeesu Nee Preema
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ పొంగి పారెనే – పొంగి పారెనే (2) నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2) ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు||
నా కన్నీటిని తుడిచినా ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||
నా దీన స్థితిని చూచిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||
నా భారంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.