TG-3746
Telugu

నా కనుల వెంబడి

Naa Kanula Vembadi

0
views
పల్లవి

నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల||

1వ చరణం

అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో||

2వ చరణం

సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||