♪♫
TG-2645
Telugu
నా కోసమా ఈ సిలువ
naa koosamaa ee siluva
78
views
పల్లవి
నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా ||నా కోసమా||
1వ చరణం
నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో… నీ పాదాలలో… నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) ||నా కోసమా||
2వ చరణం
నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై (2) నీ శిరస్సుపై… నీ శరీరముపై… నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) ||నా కోసమా||
