TG-5145
Telugu

నా కొరకై అన్నియు చేసెను యేసు

Naa Korakai Anniyu Cheesenu Yeesu

20
views
పల్లవి

నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో (2) నా కొరకై అన్నియు చేసినందులకు (2) నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై||

1వ చరణం

క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2) క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2) ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై||

2వ చరణం

ఆకాశ పక్షులను గమనించుడి విత్తవు అవి పంట కోయవు (2) వాటిని పోషించునట్టి పరమ పితా (2) మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై||

3వ చరణం

ఏమి ధరింతుమని చింతపడకు అడవి పువ్వులను తేరి చూడుము (2) అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2) తానె – నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై||

4వ చరణం

రేపటి దినము గూర్చి చింత పడకు ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2) రేపు దాని సంగతులనదే చింతించున్ (2) ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై||

5వ చరణం

ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదు వేల మందిని కూడా (2) తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2) యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.