నా నీతికి ఆధారమా నిబంధన మందసమా
Naa Neethiki Aadhaaramaa Nibandhana Mandasamaa
నా నీతికి ఆధారమా నిబంధన మందసమా (2) అనుబంధమా మకరందమా నాలో ఆనందమా (2) మహనీయుడా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా (2) ||నా నీతికి||
నీ ప్రేమ నాపై ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై అన్నీ వేళలా ఆదుకున్నావులే (2) అలసిన నా ఆశ తృప్తి పరచగా (2) అంకితమైనావులే కృపలో దాచావులే (2) ||మహానీయుడా||
నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే నీ వలె మారెనులే (2) ||మహానీయుడా||
నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు నా పక్షమై నిలచినావు (2) ||మహానీయుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.