TG-3502
Telugu

నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా

naa neeti sooryudaa – bhuvineelu yeesayyaa

Hosanna Ministriesపాసరోరు ఆనంద్ · Pasror Anand
1
views
Chorus

నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2) రాజులకే మహారాజవు కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి (2) ||నా నీతి||

1వ చరణం

శ్రమలలో - బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే - కృపావాక్యమే నను వీడని అనుబంధమై (2) నీమాటలే - జలధారాలై సంతృప్తి నిచ్చెను నీమాటలే - ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజవు కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి ||నా నీతి||

2వ చరణం

మేలులకై - సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు - కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి (2) భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై - అధిక స్తోత్రము పొందుచున్నవాడా ఘనపరుతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి ||నా నీతి||

3వ చరణం

సంఘమై - నీ స్వాస్థ్యమై నను నీ యెదుట నిలపాలని ఆత్మతో - మహిమాత్మతో నన్ను ముద్రించి యున్నావు నీవు (2) వరములతో - ఫలములతో నీకై బ్రతకాలని తుదిశ్వాస - నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయా కారుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితం నిను చేరే ఆశయం తీరాలయ్యా నిను చూసే ఆక్షణం రావాలయ్యా ||నా నీతి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.