TG-665
Telugu

నా నిమిత్తమాయన మహిని శ్రమలు

naa nimiththamaayana mahini shramalu

200
views
పల్లవి

నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను ఘనధనముల రోసెను అనుమతించె చావుకు

1వ చరణం

నా నిమిత్తమె (3) మరణ మాయెను తన జీవమును నాకు బలిగా ధారపోసెను ||నా నిమిత్తమాయన||

2వ చరణం

గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని ||నా నిమిత్తమాయన||

3వ చరణం

అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు అయినను దేవుడు అతని నలుగగొట్టెను ||నా నిమిత్తమాయన||

4వ చరణం

అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్ క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా ||నా నిమిత్తమాయన||

5వ చరణం

రోగముల్ భరించెను వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను ||నా నిమిత్తమాయన||

6వ చరణం

గాయములను పొందెను కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను ||నా నిమిత్తమాయన||

7వ చరణం

ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి ||నా నిమిత్తమాయన||

8వ చరణం

తన యనుభవమున్ మనల దోషరహితులన్ చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను ||నా నిమిత్తమాయన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.