♪♫
TG-5202
Telugu
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
Naa Nootan Kroththa Paata Naa Yeesu Ichchenu
18
views
పల్లవి
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను (2) ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా (2) హల్లెలూయా ||నా నోటన్||
1వ చరణం
అంధకార పాపమంత నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందించెదను||
2వ చరణం
దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందించెదను||
3వ చరణం
నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2) ||ఆనందించెదను||
4వ చరణం
వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2) ||ఆనందించెదను||
5వ చరణం
భువిలోని బాధలు నన్నేమి చేయును పరలోక దీవెనకై వేచియున్నాను (2) ||ఆనందించెదను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.