♪♫
TG-5134
Telugu
నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
Naa Oohakandani Preemathoo Nannu Neevu Pilichaavu
0
views
పల్లవి
నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2) నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు నీ సాక్షిగా నను నిలిపావు (2) ||నా ఊహకందని||
1వ చరణం
అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2) ఏనాడు అనుకోలేదు నన్ను నీవు ఎన్నుకుంటావని (2) ||నా ఊహకందని||
2వ చరణం
జీవితమంతా శూన్యమైపోగా నాకున్న వారే నన్ను విడచిపోగా (2) ఏనాడు అనుకోలేదు నాకు తోడుగా నీవుంటావని (2) ||నా ఊహకందని||
3వ చరణం
నా జీవితాన్ని నీవు మార్చినావు నీ సేవలోనే నన్ను నిల్పినావు (2) ఏనాడు అనుకోలేదు నా జీవితం ఇలా మారుతుందని (2) ||నా ఊహకందని||