నా పక్షమున నీవుండగా ముందెవరూ నిలువలేరుగా
naa pakshamuna neevundagaa mundevaroo niluvaleerugaa
నా పక్షమున నీవుండగా ముందెవరూ నిలువలేరుగా ఊరక నిలిచిన కార్యం జరుగును అ.ప.: యుద్ధము నీదే మా యెహోవా
మోసగించబడ్డాను త్రోసివేయబడ్డాను ఆందోళనతో విలపించాను నా దుఃఖమును నాట్యంగా నీవే మార్చావు వేదించిన శత్రువు ఆశ భంగం చేసావు నెమ్మదినిచ్చావు యేసూ నెమ్మదినిచ్చావు ||నా పక్షమున ||
అణగద్రొక్కబడ్డాను విడిచిపెట్టబడ్డాను అంతా ముగిసిందనుకున్నాను నా ఓటమిని విజయంగా నీవే మార్చావు కోల్పోయిన స్థానం కంటే హెచ్చుగా లేపావు గాయం మాన్పావు యేసూ గాయం మాన్పావు ||నా పక్షమున ||
గేళి చేయబడ్డాను గాయపర్చబడ్డాను అవమానముతో సగమయ్యాను నా స్వప్నమును సత్యంగా నీవే మార్చావు ఊహించని దిక్కుల నుండి సాయం పంపావు భారం దించావు యేసూ భారం దించావు ||నా పక్షమున ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
