నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు

naa peeree theliyani prajalu endaroo unnaaru

🎵 TG-1094🌐 Telugu
పల్లవి

నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు || 2 || ఎవరైనా మీలో ఒకరైనా (2) - వెళతార నా ప్రేమను చెబుతారా (2) ||నా పేరే ||

1వ చరణం

రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామములో ఊరిలో పలు వీధుల్లో || 2 || ఎవరైనా మీలో ఒకరైనా (2) - వెళతార నా ప్రేమను చెబుతారా (2) ||నా పేరే ||

2వ చరణం

వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండి వెళ్ళలేక పోతె వెళ్లే వారిని పంపండి || 2 || ఎవరైనా మీలో ఒకరైనా (2) - వెళతార నా ప్రేమను చెబుతారా (2) ||నా పేరే ||

Report Error