నా పూర్ణ హృదయముతో
naa poorna hrudayamutoo
నా పూర్ణ హృదయముతో-నా పూర్ణ ఆత్మతో నిను ఆరాధించి కొనియాడి - స్మరణము చేసెదను నా జీవితమంతా నీనామమే ధ్యానము చేసెదను
యేసయ్యా-యేసయ్యా యేసయ్యా-నా యేసయ్యా నీ భక్తునిగా మారి నిత్యము గానము చేసెదను సజీవ యాగముగా మారి సువాసనవుతాను ||నా పూర్ణ||
అపవాది నా ఆత్మను మలినము చేయుటకు ఈ లోక అందాలన్నీ ఇంపుగ చూపినా ఇహలోక ఆశలన్నీ నాలోన శూన్యపరచి సాతానును నా కాళ్ళ క్రింద త్రొక్కించావయ్యా ||యేసయ్యా||
నా ప్రస్తుత గడియలు అన్ని భయమును రేపగా ఈ సంద్రం చీల్చబడదని ఊహించగా నిరీక్షించి ప్రార్థిస్తే ఊహకందనంతగా రెండంతల నీ ఆశీర్వాదం కురిపించావయ్యా ||యేసయ్యా||
నెలవైన వారందరి క్షేమము కోరాను మేలైన మాటలు చెప్పి శత్రువునయ్యాను మిమ్ము త్రోసివేసినట్లే నన్ను త్రోసివేసారు తీసేసిన ఆ మూల రాయిని తలరాయిగా చేశావయ్యా |యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
