TG-5206
Telugu

నా ప్రాణ నేస్తమా నా యేసు దైవమా

Naa Praana Neesthamaa Naa Yeesu Daivamaa

16
views
పల్లవి

నా ప్రాణ నేస్తమా నా యేసు దైవమా (2) నీ ధ్యాసలో నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా (2) ||నా||

1వ చరణం

ఆశ తీరా సేవించినా తియ్యనైన నీ ప్రేమను అంతులేని ఆ ప్రేమలో పరవశించి కిర్తించనా ||నా ప్రాణ నేస్తమా||

2వ చరణం

నీవే ఉదయం నీవే అభయం నీతోనే జీవితo నీవే శరణం నాలో అనిశం నీ ప్రేమ శాశ్వతం మరువలేని నీ స్నేహము మధురమైన సంబంధము కనులలోన నీ రూపము వెలిగే నాలో నీ దీపము పలికే నాలో గీతమై నీదు ప్రేమ సంగీతమై ||నా ప్రాణ నేస్తమా||

3వ చరణం

నీవే శిఖరం  చూపే గమనం నీలోనే అమృతం నీతో సమయం కోరే తరుణం నీ ప్రేమ పావనం శిదిలిమైన నాప్రాణము కరుణ చూపే నీవాక్యము సిలువ చాటు నీ త్యాగము తెలిపే ప్రేమ సందేశము పదములైన చాలునా నీదు ప్రేమ నేపాడనా ||నా ప్రాణ నేస్తమా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.