♪♫
TG-3254
Telugu
నా ప్రాణమా నా జీవమా ఆధారమైయున్న నా దైవమా
naa praanamaa naa jeevamaa aadhaaramaiyunna naa daivamaa
11
views
Chorus
నా ప్రాణమా నా జీవమా ఆధారమైయున్న నా దైవమా (2) మహిమ మహిమ మహిమ నీకే ఘనత ఘనత ఘనత యేసయ్యకే (2) ||నా ప్రాణమా||
Verse 1
దురాభిమాన పాపములో నన్ను పడకుండా కాపాడినావు (2) నీదు ప్రేమ నాకు చూపి నన్ను రక్షించిన నా యేసయ్య (2) నన్ను రక్షించిన నా యేసయ్య... ||నా ప్రాణమా||
Verse 2
మరణము నుండి తప్పించి నన్ను పరముకు చేర్చావు నా యేసయ్య (2) పరిశుద్ధులతో పాలు పొందే అమరత్వమును నాకు ఇచ్చావయ్యా (2) అమరత్వమును నాకు ఇచ్చావయ్యా... ||నా ప్రాణమా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
