నా ప్రాణమా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధన
Naa Praanamaa Naa Yeesayyaa Neekeenayyaa Sthuthi Aaraadhana
నా ప్రాణమా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధన (2) ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) ||నా||
పడిపోయినా వేలలలోన నీవే నన్ను లేపితివయ్యా ఆత్మీయతలోనే కృంగిన వేళ నీ ఆత్మతో నన్ను నింపితివయ్యా (2) ఎన్నడు నన్ను నీవు విడువలేదయ్యా ఏనాడు నన్ను నీవు మరువలేదయ్యా (2) ||నా ప్రాణమా||
కష్టకాలంలో నేనున్నప్పుడు శ్రమలలోనా నేనున్నప్పుడు వేదనలోనా నేనున్నప్పుడు బలహీనతలో నేనున్నప్పుడు (2) ఎన్నడు నన్ను నీవు విడువలేదయ్యా ఏనాడు నన్ను నీవు మరువలేదయ్యా (2) ||నా||
లోకములోనా ఉన్నదేదియు నాకు వద్దయ్యా నా యేసయ్యా పరలోకంలో నీతో నేను జీవించాలి అనే ఆశ ఉందయ్యా (2) విడువని దేవుడవు నా యేసయ్యా మరువని దేవుడవు నా యేసయ్యా (2) నా ప్రాణమా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధన
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.