♪♫
TG-3767
Telugu
నా ప్రాణప్రియుడా
Naa Praanapriyudaa
20
views
పల్లవి
నా ప్రాణప్రియుడా నా యేసురాజా నా యేలినవాడా నా స్నేహితుడా (2) నిన్ను చేరాలని నీతో ఉండాలని (2) నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2) ||నా ప్రాణ||
1వ చరణం
నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా (2) నీ ప్రేమను రుచి చూచితి నీ వశమైతిని యేసయ్యా (2) ||నా ప్రాణ||
2వ చరణం
నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా (2) నిన్ను హత్తుకొని నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా (2) ||నా ప్రాణ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.