TG-3768
Telugu

నా ప్రాణప్రియుడా యేసురాజా

Naa Praanapriyudaa Yesu

20
views
పల్లవి

నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||

1వ చరణం

విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||

2వ చరణం

గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||

3వ చరణం

రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నాకొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||

4వ చరణం

నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతులతోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||

5వ చరణం

వాగ్ధానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.