TG-1537
Telugu

నా ప్రాణమా నాలో నీవు

naa praannamaa naaloo neevu

50
views
పల్లవి

నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా||

1వ చరణం

ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ (2) నీ కొరకే బలియైన యేసు సిలువను గూర్చి తలపోయుమా అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా||

2వ చరణం

ఆప్తులంతా నిను వీడిననూ శత్రువులే నీపై లేచిననూ తల్లి అయినా మరచినా మరచున్ నేను నిన్ను మరువాననినా యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా ఐశ్వర్యమే లేకున్ననూ సౌఖ్య జీవితమే కరువైననూ ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చిననూ క్రీస్తునికే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.