TG-666
Telugu

నా ప్రాణప్రియుడా యేసు రాజా

naa praannapriyudaa yeesu raajaa

201
views
పల్లవి

నా ప్రాణప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

1వ చరణం

అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బ..హు ప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణప్రియుడా||

2వ చరణం

విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణప్రియుడా||

3వ చరణం

గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణప్రియుడా||

4వ చరణం

రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణప్రియుడా||

5వ చరణం

నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తు... తుల తోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణప్రియుడా||

6వ చరణం

వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నా కిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ ||నా ప్రాణప్రియుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.