నా సంకటంబులన్నియు తీరిపోయె సంహారరదూత

naa sankatanbulanniyu theeripooye sanhaararaduutha

🎵 TG-668💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా సంకటంబులన్నియు తీరిపోయె సంహారరదూత నన్ను దాటిపోయె

1వ చరణం

గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంకటంబులన్నియు||

2వ చరణం

ఫరోకు నేనింక దాసుడను కాను పరమకానానుకు హక్కుదారుడను ||నా సంకటంబులన్నియు||

3వ చరణం

మారాను మధురముగ మార్చినాకు బండను పగులగొట్టి దాహం దీర్చెను ||నా సంకటంబులన్నియు||

4వ చరణం

మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే అదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంకటంబులన్నియు||

5వ చరణం

ఆనందమే పరమానందమే కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంకటంబులన్నియు||

6వ చరణం

అరణ్యజీవితమున యేసు నాయకుడు ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు ||నా సంకటంబులన్నియు||

7వ చరణం

నా బలము నా ఆశ్రయము నా రక్షణ యేసయ్య హల్లెలూయా ||నా సంకటంబులన్నియు||

Report Error