TG-5184
Telugu

నా తల్లి నను మరచినా నా వారే నను విడచినా

Naa Thalli Nanu Marachinaa Naa Vaaree Nanu Vidachinaa

19
views
పల్లవి

నా తల్లి నను మరచినా నా వారే నను విడచినా (2) విడువని దేవుడవయ్యా ఎడబాయని వాడవయ్యా (2) యేసయ్యా హల్లెలూయా (4) ||నా తల్లి||

1వ చరణం

స్నేహితులే నన్ను బాధించినా బంధువులే నన్ను వెలివేసినా (2) అన్నదమ్ములే నన్ను నిందించినా నే నమ్మినవారే గాయపరచినా (2) ||విడువని||

2వ చరణం

లోకమంతా నన్ను ఏడ్పించినా శత్రువులే నన్ను వేధించినా (2) సాతానే  నన్ను శోధించినా సమాజమే నన్ను త్రోసేసినా (2) ||విడువని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.