నా తండ్రీ నన్ను మన్నించు నీకన్న ప్రేమించే వారెవరు?
Naa Thandree Nannu Manninchu Neekanna Preeminchee Vaarevaru?
నా తండ్రి నన్ను మన్నించు నీకన్నా ప్రేమించే వారెవరు (2) లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2) నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది ||లోకం||
నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించినా ప్రేమా – ఎక్కడ కనరాలేదు (2) నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివె ||నా తండ్రి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.