TG-5187
Telugu

నా తోడుగా ఉన్నవాడవే నాచేయి పట్టి నడుపు వాడవే

naa toodugaa unnavaadavee naacheeyi patti nadupu vaadavee

19
views
పల్లవి

నా తోడుగా ఉన్నవాడవే నాచేయి పట్టి నడుపు వాడవే యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా (2) ||నా తోడు||

1వ చరణం

నా అనువారు నాకు దూరమైనా నా తల్లి తండ్రులే నాచేయి విడచినా ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ... ఆ... ఆ..(2) నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే... (2) ||నా తోడు||

2వ చరణం

నాపాదములు జారిన వేళ నీకృపతో నన్ను ఆదుకొంటివే నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి ఆ... ఆ... ఆ..(2) నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..(2) ||నా తోడు||

3వ చరణం

హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడచే పరిస్థితిలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఆ... ఆ... ఆ..(2) కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..(2) ||నా తోడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.