నా యజమానుడా (తేజో మహిమ)
naa yajamaanudaa (teejoo mahima)
తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నాను నా యజమానుడా, యేసుప్రభువా! ఎచట కేగెదను (2)
నా తల్లిదండ్రులు నను విడచినను నీవు నన్ను చేరదీసితివే (2) నీ జనముగా, నీ స్వాస్థ్యముగా ఆశీర్వదించితివే (2) ||నా యజమానుడా||
జీవమార్గములో నడిపించితివే పూర్ణ సంతోషం నాకిచ్చితివే (2) నీ చేతిలోని నిత్యమైన సుఖముతో నను సేదదీర్చితివే (2)
ఆత్మీయముగా కుంటితనముతో ఒంటరినైన నన్ను ప్రేమించిన (2) నా కొలువు కన్నా నాకున్న దానికి కన్నా నిను ప్రేమింతునయ్యా (2) ||నా యజమానుడా||
నీ దాసులలో ఒకనిగాను ఉండుటకు నేను ఇష్టపడితిని (2) నీ కుమారునిగా నన్నుంచుకొని దన్యుని జేసితివి (2) ||నా యజమానుడా||
ఉహకుమించిన పరమ ఇంటిని మెరుగైన మన్నానిచ్చి తెల్లని రాతినిచ్చి (2) దయగల దేశమునందు పౌరుని జేసి నిరతముంచితివే (2) ||నా యజమానుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
