నా యేసు నాధా ననుఁ

naa yeesu naadhaa nanum

🎵 TG-380💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా యేసు నాధా ననుఁ జూడవే నా జీవనాధా నా యేసునాధ మా నవ పాప మోచక నీ యనుగ్రహముచే నిరతంబు భువిలోన ||నా యేసు||

1వ చరణం

వింటిని నేను నా హృదయంబు వింతఁ బొందఁగను మింటనుండి నీవు మేదిని కరుదెంచి యెంటి నర్పించితి వొనరంగ నా కొరకు ||నా యేసు||

2వ చరణం

నీ యానతులను నిజముగ మీరి నే నుంటి మున్ను నా యెదను గుందుచు నా పాపముల కొరకు నీ యొద్దఁ జేరెద నిజరక్షకుఁడ వనుచు ||నా యేసు||

3వ చరణం

నేను నీ నెనరు రుచి జూచితి నిది యెంతో తనరు దీనుఃడ నగు నేను ధృడ కృతజ్ఞత ప్రేమల్ గానుపింపఁగ నీ కడకు వత్తును దేవ ||నా యేసు||

4వ చరణం

నే నశక్తుడను నిను సేవింప నిత్యంబు ధరను గానఁ బ్రార్థనఁ బూని ఘనుఃడ వని నమ్ముచు నానందమున వత్తు ననిశంబు నీ దరికి ||నా యేసు||

5వ చరణం

దయ చేయు మయ్యా సత్యాత్మను దాసుని కిపుడు దయచేసి శుద్ధాత్మఁ ద్వరగాఁ గల్గించుము ప్రియముగ నీ సేవ పెంపుసేయఁగ శక్తి ||నా యేసు||

6వ చరణం

నీవు నాతోడ నెప్పుడు నుండు నిజ మొనగూడ నీవు నాతో నుండ నిర్భయముగ నేను ద్రోవఁ బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు ||నా యేసు||

Report Error