TG-425
Telugu

నాధా! సముయేలు రీతి నీ

naadhaa! samuyeelu reethi nee

205
views
పల్లవి

నాధా! సముయేలు రీతి నీ యామోద శబ్దము సేవకుఁడ నైన నన్ను నాతో డాలకింపనీ నాతో నీవేమందువో నే నాలించువాఁడను.

1వ చరణం

నీ మాట గ్రహించునట్లు దానిఁ దేటపర్చుము నిన్ను వెంబడించునట్లు నిబ్బరింపఁ జేయుము నేను నీదు గొఱ్ఱెను 'బండ నీడలో మేపు' ||నాధా! సముయేలు||

2వ చరణం

నేను స్వల్పశిష్యుడను నన్ నిరాకరింపకు నిన్నాలింప నెంత యాశ నీ వెఱింగి యుందువు ఆత్మ యక్కరల్ తీర్చు ధన్యుఁడన్ నే నౌదును ||నాధా! సముయేలు||

3వ చరణం

నాధా, నీ శబ్ద మాలింప నన్ను సిద్ధపర్చుము నీదుమాట లక్ష్య పెట్టి నిత్యసేవఁ జేయనీ నాతో నీవేమందువో నే నాలించువాఁడనే. ||నాధా! సముయేలు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.