♪♫
TG-5256
Telugu
నాదు హృదయపు ద్వారము తెరచెదను
Naadu Hrudayapu Dvaaramu Therachedanu
0
views
పల్లవి
నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి 1. యేసు చచ్చిన వారిని లేపితివే - మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివే నేను పాపిని రోగిని నీవేగతి - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ 2. ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి 3. యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ నాకు వేరొక మార్గము లేదికను 4. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా నేను పాపిని అంధుని యేసూ ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ