TG-5254
Telugu

నాదు ప్రాణము ప్రభో నేను నీ కర్పింతును

Naadu Praanamu Prabhoo Neenu Nee Karpinthunu

0
views
పల్లవి

1.  నాదు ప్రాణము ప్రభో - నేను నీ కర్పింతును నాదు చేతులెప్పుడు - నీదు సేవ చేయనీ 2.  నాదు కాళ్ళు లెస్సగా - నీదు త్రోవ నడ్వనీ నాదు స్వర మెప్పుడు - నీదు స్తుతి పాడని 3.  నాదు నోరు నిత్యము - నీదు బోధ పల్కనీ నాదు సొమ్ము సొత్తులు - నీకు నిత్తునెప్పుడు 4.  నీదు కాలమంతయు - నిన్ను బ్రస్తుతింపనీ బుద్ధిపూర్వకంబుగా - నిన్ను నేను కొల్వనీ 5.  సొంతమేలు గోరక - నీదు కీర్తి గోరుచు నాదు నంతరంగము - స్వీకరించి యేలుము 6.  నాదు నిండు ప్రేమను - నీకర్పింతు నెప్పుడు నన్ను నీదు సొత్తుగా - నీవంగీకరింపుము