నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘనంబు చేయుచున్నది నాదు నాత్మ
దేవునం దా నం మొందెను నిరతము
|
|నాదు||
1. దేవుఁడు తన భృత్యురాలి దీనస్థితి లక్షించెను ఈ వసుంధరఁ దరము
లన్నిఁక నెన్ను నను శుభవతి యని
|
|నాదు||
2. సర్వ శక్తుఁడు మహాకృత్యము సంభవింపఁ జేసెను ఉర్విలో నా ప్రభుని
నామం బోప్పు బరిశుద్ధంబుగా
|
|నాదు||
3. భయము భక్తియుఁ గల్గి దేవుని భజనఁ జేసెడి వారికి నయముగాఁ
దన కృప నొసంగు న నయమును దరతరములు
|
|నాదు||
4. విదిత బాహువు చేత శౌర్యము విభుఁడు కనపర్చెను హృదయపుఁ
దలఁపులను గర్వులఁ జెదరఁ గొట్టెను నిజముగ
|
|నాదు||
5. ఆసనాసీనులై యున్న యతిశయాత్ములన్ బడఁ ద్రోసి దేవుఁడు దీనులను
సింహాసనంబుల నునిచెను
|
|నాదు||
6. క్షుధితులను దన మధురములచేఁ గోరి తృప్తి పర్చెను అధిక
ధనవంతులను రిక్త హస్తములతో ననిపెను
|
|నాదు||
7. ఆది పితరులైన యబ్రా హాము కతని సంతున కద్వితీయుఁ డాదిలోక
నాన తిచ్చినట్లుగా
|
|నాదు||
8. నిరతమును దన కరుణఁ జూప నిజముగా మది నెంచెను వరదుఁ
డిశ్రాయేలునకుఁ దన వర సహాయ మొనర్చెను
|
|నాదు||
9. పరమ తండ్రికి దైవ సుతునకు పావనాత్మకు నిఁక నిహ పరమ
లందును యుగయుగంబులఁ బరఁగు మహిమ మామేన్
|
|నాదు||
naadu praanamu prabhuni migula ghananbu cheeyuchunnadi naadu naathma
deevunan daa nan mondenu nirathamu
|
|naadu||
1. deevundu thana bhruthyuraali deenasthithi lakshinchenu ee vasundharan daramu
lanninka nennu nanu shubhavathi yani
|
|naadu||
2. sarva shakthundu mahaakruthyamu sanbhavinpan jeesenu urviloo naa prabhuni
naaman booppu barishuddhanbugaa
|
|naadu||
3. bhayamu bhakthiyun galgi deevuni bhajanan jeesedi vaariki nayamugaan
dana krupa nosangu na nayamunu daratharamulu
|
|naadu||
4. viditha baahuvu cheetha shauryamu vibhundu kanaparchenu hrudayapun
dalanpulanu garvulan jedaran gottenu nijamuga
|
|naadu||
5. aasanaaseenulai yunna yathishayaathmulan badan droosi deevundu deenulanu
sinhaasananbula nunichenu
|
|naadu||
6. kshudhithulanu dana madhuramulacheen goori thrupthi parchenu adhika
dhanavanthulanu riktha hasthamulathoo nanipenu
|
|naadu||
7. aadi pitharulaina yabraa haamu kathani santhuna kadvitheeyun daadilooka
naana thichchinatlugaa
|
|naadu||
8. nirathamunu dana karunan joopa nijamugaa madi nenchenu varadun
dishraayeelunakun dana vara sahaaya monarchenu
|
|naadu||
9. parama thandriki daiva suthunaku paavanaathmaku ninka niha parama
landunu yugayuganbulan barangu mahima maameen
|
|naadu||