TG-3952
Telugu

నీవే నన్ను కోరుకున్నావు

Neeve Nannu Korukunnaavu

0
views
పల్లవి

నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే||

1వ చరణం

నీ అరచేతిలో నను చెక్కుకున్నావు నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు నీ రాజ్యములో నను దాచి ఉంచావు నీ నామములో నను రక్షించావు ||ఎంత||

2వ చరణం

నీ వాక్యముతో నను శుద్ధి చేసావు నీ రక్తముతో నను కడిగివేసావు నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత||